అవమానంతో రూ.4 కోట్లు వెనక్కిచ్చేసిన హీరో | Producer suniel Narang Sensational Comments | Filmibeat

Jack Movie Producer Reveals Shocking Comments Said That Siddu Jonnalagadda Charged 13cr As remuneration Later He Returned 4 Cr To Him Because Of Movie result.

ఎన్నో ఏళ్ల నుంచి సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా, నిర్మాతగా కొనసాగుతున్న సునీల్ నారంగ్ ప్రస్తుతం కుబేరతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. జూన్ 20న కుబేర మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. అయితే ఈ క్రమంలో సునీల్ నారంగ్ తాజాగా సిద్దు జొన్నలగడ్డ జాక్ మీద ఆయన చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.సునీల్ మాట్లాడుతూ అసలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేమని అన్నారు.ఇది మంచి సినిమా అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మడం మానేశానని తెలిపారు.
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ఎక్సపెక్టషన్స్ పెట్టుకునే నేను ఇప్పుడు అలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదన్నారు. జాక్ లాంటి సినిమా చూసిన తరువాత కూడా ఇంకేం మాట్లాడగలం అంటూ దారుణంగా మాట్లాడేశారు.
జాక్ మూవీ ఈ ఏడాదికే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వంద కోట్ల హీరో అంటూ అందరూ తెగ ఊదరగొట్టేశారు. కానీ చివరకు లాంగ్ రన్‌లో రెండు కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది జాక్ చిత్రం.
అలా ఒక్కసారిగా సిద్దు మీదున్న అంచనాలు, క్రేజ్, డిమాండ్ అన్నింటినీ జాక్ తుడిచేసింది. ఇక సిద్దు మార్కెట్ మీదే సినీ జనాలు అనుమాన పడేలా చేసింది జాక్. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్‌లోనూ ఎన్నో డిజాస్టర్లున్నాయి.. వాటన్నంటిలోనూ ఇదే అతి పెద్ద డిజాస్టర్ అన్నట్టుగా మారింది. ఈ మధ్య ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి సైతం జాక్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కనీసం రెండు కోట్ల షేర్ కూడా రాలేదని, కానీ ఆ హీరో మాత్రం 13 కోట్లు తీసుకుంటున్నాడని విమర్శించారు. డిమాండ్, మార్కెట్‌కు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ తీసుకోవాలని అంతా సూచిస్తున్నారు. ఇక నిర్మాతకు సిద్దు నాలుగు కోట్లు తిరిగి ఇచ్చేశారని సమాచారం.

#sunielnarang #siddujonnalagadda #latest #jack #filmibeat #filmibeattelugu

Also Read

అలా ఆశపెట్టుకొంటే హార్ట్ ఎటాక్.. జాక్ డిజాస్టర్ రిజల్ట్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్ :: https://telugu.filmibeat.com/interviews/producer-sunil-narang-comments-on-siddu-jonnalagaddas-jack-disaster-result-157291.html?ref=DMDesc

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc